ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind Kejriwal )ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.ఈడీ అరెస్ట్, కస్టడీని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేజ్రీవాల్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో ( Justice Sanjeev Khanna, Justice Dipankar Dutta )కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.కాగా కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది.
ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్ పై సీఎం కేజ్రీవాల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయగా.
ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.







