అనకాపల్లి జిల్లా( Anakapalli District ) చోడవరంలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇవి ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని ఆయన తెలిపారు.
మళ్లీ మోసం చేయాలని చంద్రబాబు( Chandrababu ) ప్రయతిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు.
వైసీపీకి ( YCP ) ఓటు వేస్తేనే పథకాలు అన్నీ కొనసాగుతాయని పేర్కొన్నారు.చంద్రబాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనని సీఎం జగన్ తెలిపారు.
2014 మ్యానిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీ అయినా చంద్రబాబు అమలు చేశారా అని ప్రశ్నించారు.మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత వైసీపీదని చెప్పారు.
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు వదిలేశారన్నారు.చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా అంటూ ఎద్దేవా చేశారు.
దోచుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.చంద్రబాబు డబ్బులు పంచితే తీసుకోండన్న సీఎం జగన్ ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు.







