నిజామాబాద్ జిల్లా బోధన్ లోని బీసీ వసతి గృహం( Nizamabad District Bodhan BC Hostel )లో దారుణ ఘటన చోటు చేసుకుంది.విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెంకట్ కు మరో ఆరుగురు విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగింది.దాడులు చేసుకున్న అనంతరం వెంకట్ ను గొంతు నులిమి హతమార్చారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగానే ఆరుగురు విద్యార్థులతో పాటు బీసీ వసతి గృహం వార్డెన్ స్వామి( BC Hostel Warden Swamy )ని అరెస్ట్ చేశారు.
అలాగే మృతుడు వెంకట్ గాంధారి మండలం తిప్పారం తండావాసిగా గుర్తించారు.మరోవైపు మృతుడు వెంకట్ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
.