సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఇలా సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth ) అలాగే దీప్తి సునయన ( Deepthi Sunaina ) వంటి వాళ్ళు కూడా ఒకరిని చెప్పాలి.
వీరిద్దరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను కవర్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .అదేవిధంగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా షన్ను దీప్తి ఇద్దరూ కలిసి పలు కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్లలో నటించడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అదే సమయంలోనే షన్ను కి బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ 5 కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం రావడంతో ఈయన హౌస్ లోకి వెళ్లారు.
అయితే అక్కడ మరొక యూట్యూబర్ సిరి( Siri ) తో కలిసి ఈయన చేసిన వ్యవహారం మామూలుగా లేదు దీంతో భారీ స్థాయిలో నెగెటివిటీ ఎదుర్కొన్నారు.
ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా కప్పు గెల్చుకోవాల్సినటువంటి షన్ను చివరికి రన్నర్ గా నిలిచారు.అయితే హౌస్ లో ఈయన వ్యవహారం చూసి మండిపడినటువంటి దీప్తి సునయన ఆయనకు బ్రేకప్ చెప్పకున్నారు.ఇలా వీరి బ్రేకప్ విషయం గురించి దీప్తి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు ఎంతో ఫీలయ్యారు.
అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎదురుపడిన మాట్లాడుకోవడం లేదు ఎలాగైనా వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇలా షన్నుతో బ్రేకప్ చెప్పుకున్నటువంటి ఈమె తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు.ఇలా వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్( Web Series Cover Songs ) అంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి దీప్తి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.తాజాగా దీప్తి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
ఇందులో ఈమె చాలా సంతోషంతో డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈ వీడియో పై స్పందిస్తూ అదేంటి షన్ను పుట్టినరోజు సందర్భంగా ఇలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరు షన్నుకు బర్త్ డే విషెస్ తెలియజేయవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ డాన్స్ వీడియో వైరల్ అవుతుంది.