టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఢీ షోతో టీం లీడర్ గా మారిన దీపికా పిల్లి( Deepika Pilli ) ఢీ లో ఒక్క సీజన్ మాత్రమే చేసినా తన ముద్ర వేసుకుంది.ఈ క్రమంలో ఈటీవీ నుణి స్టార్ మాకి షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ అదిరింది షో హోస్ట్ చేసింది.
ఆ తర్వాత ఆహా లో కామెడీ స్టార్ ఎక్సేంజ్ షోకి యాంకరింగ్ చేసింది.ఈ షోస్ ద్వారా తనకు వచ్చిన క్రేజ్ తో తన సోషల్ మీడియా పాపులారిటీ పెంచుకున్న దీపికా పిల్లి వాంటెడ్ పండుగాడ్( Wanted Pandugad ) అనే సినిమాలో కూడా నటించింది.
ఆ సినిమాలో సుడిగాలి సుధీర్ కి జోడీగా నటించిన అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది.
అయితే తన కెరీర్ ఎక్కడ మొదలు పెట్టిందో మళ్లీ తిరిగి అక్కడకే వచ్చింది దీపికా.ఢీ లేటెస్ట్ సీజన్ ఢీ ప్రీమియర్ లీగ్ లో( Dhee Premier League ) మళ్లీ దీపిక ప్రత్యక్షమైంది.దీపిక సోషల్ మీడియా క్రేజ్ షోకి ప్లస్ అవుతుందని ఆమెను తీసుకున్నారు.
దీపికాకి కూడా బయట ఎక్కడో పనిచేయడం కన్నా మల్లెమాల టీం లో పనిచేయడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది.అందుకే ఢీ ఛాన్స్ రాగానే ఓకే అనేసింది.
ప్రస్తుతం ఉన్న తన డిమాండ్ ని తగ్గించుకుని మరీ ఢీ లో ఆమె టీం లీడర్ గా చేస్తుందని టాక్.