ఏపీ బీజేపీలో విభేదాలు మరింత ముదిరాయి.ఈ క్రమంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల మధ్య వార్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది.
ఇటీవల సోమువీర్రాజు లక్ష్యంగా కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కన్నాపై చర్యలు తీసుకోవాలని సోమువీర్రాజు పట్టుబడుతున్నారు.
కన్నా చేసిన విమర్శలను ఇంగ్లీష్, హిందీలోకి ట్రాన్స్ లేట్ చేసి సోమువీర్రాజు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపినట్లు తెలుస్తోంది.అయితే కన్నా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యే విమర్శలు చేస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తుంది.
టీడీపీ, జనసేనకు కన్నా టచ్ లో ఉన్నారని చెబుతోంది.మరోవైపు ఇప్పటివరకు కన్నా లక్ష్మీనారాయణ రెండు సార్లు విమర్శలు చేసినా పార్టీ అధిష్టానం నోరు మెదపకపోవడం గమనార్హం.
.






