ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎంతోమంది దిగ్గజ నటులు కాలం చేశారు.సీనియర్ నటులుగా కొనసాగినటువంటి వారందరూ కూడా రోజుల వ్యవధిలోనే మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రవిషాదంలో ఉంది.
ఈ ఏడాది మొదట్లో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం అందరిని కలిసి వేసింది.ఇక ఈ ఏడాది చివరిలో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు.
సెప్టెంబర్ 11వ తేదీన కృష్ణంరాజు మరణించగా నవంబర్ లోనే సూపర్ స్టార్ కృష్ణ మరణించారు.
ఇలా కొన్ని వారాల వ్యవధిలోనే ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇక కృష్ణ మరణ వార్త మర్చిపోకముందే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించారు.ఈయన డిసెంబర్ 23వ తేదీ మరణించగా ఈయన మరణించిన రెండు రోజులకే చలపతిరావు మరణించారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాది చివరిలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.
అయితే ఇలాగే తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక ఏడాది చివరిలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయని సెలబ్రిటీలు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు.ఇలా తొమ్మిది సంవత్సరాలకు తెలుగు చిత్ర పరిశ్రమలు అదే బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయిందని చర్చించుకుంటున్నారు.2013 వ సంవత్సరంలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి విషాదాలు చోటుచేసుకున్నాయి.అక్టోబర్ 9వ తేదీ రియల్ స్టార్ శ్రీహరి మరణించగా, నవంబర్ 8వ తేదీ ఏవీఎస్, డిసెంబర్ 7వ తేదీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనారోగ్య సమస్యలతో మరణించారు.ఇలా తొమ్మిది సంవత్సరాల తర్వాత మరోసారి అత్యంత తక్కువ సమయంలోనే ఇలా వరుసగా సినీ సెలబ్రిటీలు మరణించడం బాధాకరం.