ఏపీ సంచలనం సృష్టించిన వైఎస్ వివేనంద రెడ్డి హత్య కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.ఈ కేసులో ఇప్పటికే కొంతమంది నిందితులుగా అరెస్ట్ కాగా అసలు నిందితులు ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది.
ఈ ప్రస్తుతం ఈ కేసు మొత్తం వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది.వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy )ని కీలక నిందితుడిగా సీబీఐ ఇప్పటికే పేర్కొనగా.మరోవైపు తనను కావాలనే ఈ కేసులో ఇరికించే చేస్తున్నారని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ ఆదేశాలివ్వడం.అవినాష్ రెడ్డి హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది.ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.స్థానిక ప్రభుత్వం అవినాష్ రెడ్డికే మద్దతు ఇస్తోందని, అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకుండా వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారని, దీనిపై విచారణ జరపాల్సిందిగా సునీత సుప్రీం కోర్టు( Supreme Court )ను ఆశ్రయించగా.
ఈ నెల 13 న దీనిపై విధారణ జరపనుంది అత్యున్నత ధర్మాసనం.కాగా ఈ నెల 30 నాటికి ఈ కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు గతంలోనే తెలంగాణ సీబీఐకి సూచించింది.
అయితే ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉండడంతో విచారణ సాధ్యం కాదు.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు 13న ఇచ్చే తీర్పు కీలకం కానుంది.ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే.తరువాత సీబీఐ( CBI ) ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తికరమైన అంశం.ఒకవేళ అవినాష్ రెడ్డికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే.30వ తేదీని డెడ్ లైన్ గా ఉంచిన ధర్మాసనం.ముగింపు తేదీని పెంచే అవకాశం ఉందా ? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి.ఒకవేళ ముగింపు తేదీ పొడిగించకుండా సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇస్తే.
తదుపరి సీబీఐ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తికరమే.మరి ఇన్ని తికమకలా మద్య చివరికి ఈ కేసుకు ఎలా ముగింపు పడుతుందో చూడాలి.







