హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మారిన నేతల ఫొటోలను తొలగించారు.ఈ మేరకు కడియం శ్రీహరి( Kadiyam Srihari ), కడియం కావ్య పార్టీ మారుతున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్( BRS ) అలర్ట్ అయింది.
ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు దాస్యం వినయ్ భాస్కర్ భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై దాస్యం వినయ్ భాస్కర్( Dasyam Vinay Bhasker ) కీలక వ్యాఖ్యలు చేశారు.కడియం ఎంతోమందిని బలిపశువులను చేశారని మండిపడ్డారు.
కడియం గతంలో చంద్రబాబును( Chandrababu ) బ్లాక్ మెయిల్ చేసి పదవులు తీసుకున్నారన్న ఆయన నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజమని ఆరోపించారు.ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీతిమాలిన చర్యలకు పాల్పడేవారికి ప్రజలే బుద్ధిచెబుతారని తెలిపారు.