Dasyam Vinay Bhasker : నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజం..: దాస్యం వినయ్ భాస్కర్
TeluguStop.com
హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మారిన నేతల ఫొటోలను తొలగించారు.ఈ మేరకు కడియం శ్రీహరి( Kadiyam Srihari ), కడియం కావ్య పార్టీ మారుతున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్( BRS ) అలర్ట్ అయింది.
ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు దాస్యం వినయ్ భాస్కర్ భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై దాస్యం వినయ్ భాస్కర్( Dasyam Vinay Bhasker ) కీలక వ్యాఖ్యలు చేశారు.
కడియం ఎంతోమందిని బలిపశువులను చేశారని మండిపడ్డారు.కడియం గతంలో చంద్రబాబును( Chandrababu ) బ్లాక్ మెయిల్ చేసి పదవులు తీసుకున్నారన్న ఆయన నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజమని ఆరోపించారు.
ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నీతిమాలిన చర్యలకు పాల్పడేవారికి ప్రజలే బుద్ధిచెబుతారని తెలిపారు.
యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవి సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?