నా తండ్రి అలాంటి వ్యక్తి కాదు.. దర్శన్ కొడుకు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, శాండిల్ వుడ్ ( Tollywood, Sandalwood )ఇండస్ట్రీలలో నటుడిగా దర్శన్( Darshan ) కు మంచి పేరు ఉంది.అయితే రేణుకాస్వామి హత్య కేసు విషయంలో దర్శన్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది.

 Darshan Son Vineesh Emotional Post Goes Viral In Social Media , Social Media , T-TeluguStop.com

రీల్ లైఫ్ లో హీరో అయిన దర్శన్ రియల్ లైఫ్ లో విలన్ అని తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.అయితే దర్శన్ తప్పు చేశాడని అతని కుటుంబ సభ్యులు మాత్రం అస్సలు నమ్మడం లేదు.

దర్శన్ కొడుకు తన తండ్రి గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.దర్శన్ కొడుకు వినీశ్ తూగూదీ( Vinesh Toogudi ) నా తండ్రి దర్శన్ తో పాటు తల్లి విజయలక్ష్మికి( Vijayalakshmi ) మానసిక ప్రశాంతత అవసరమని పేర్కొన్నారు.

నా తండ్రిని బూతులతో దూషిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అని దర్శన్ కొడుకు చెప్పుకొచ్చారు.నా తండ్రి హత్య చేసి ఉంటాడని నేను నమ్మడం లేదని దర్శన్ కొడుకు పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని దర్శన్ కొడుకు చెప్పుకొచ్చారు.అప్పటివరకు కొంచెం ఓపిక పట్టాలని వినీశ్ పోస్ట్ లో పేర్కొన్నారు.వినీశ్ వయస్సు 15 సంవత్సరాలుగా ఇంత చిన్న వయస్సులో వినీశ్ ఎంతో మెచ్యూరిటీతో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.దర్శన్ ఈ కేసు నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.

దర్శన్ వైపు తప్పు ఉందని ఆధారాలు సైతం చెబుతుండటం గమనార్హం.దర్శన్ చిన్నచిన్న తప్పుల ద్వారా కెరీర్ ను నాశనం చేసుకుంటున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.దర్శన్ కు వివాదాలు కొత్త కాదని గతంలో కూడా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube