దర్బార్ బయ్యర్లకు భారీ నష్టాలు.. రజినీయే దిక్కు!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రీసెంట్ మూవీ ‘దర్బార్’ భారీ అంచనాల నడుమ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూశారు.

 Darbar Buyers Huge Loss Pressure On Rajinikanth-TeluguStop.com

కానీ సినిమా రిలజ్ రోజునే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకోవడంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.

దర్బార్ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ సినిమా కావడం, మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను అత్యంత భారీ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేశారు.కానీ రిలీజ్ తరువాత లాభాల మాట పక్కనబెడితే, భారీ నష్టాలు వచ్చి పడ్డాయి.దీంతో చిత్ర నిర్మాతలు తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరగా, తమకు రూ.60 కోట్ల నష్టం వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు.

దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్‌ తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.గతంలోనూ బాబా సినిమా రిలీజ సమయంలో బయ్యర్లకు రజినీకాంత్ డబ్బులు వాపస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ రజినీ బయ్యర్లకు డబ్బులు తిరిగి ఇస్తాడా లేడా అనేది కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube