బి‌ఆర్‌ఎస్ కు డ్యామేజ్.. ప్రతికూల ప్రభావాలే !

తెలంగాణ పోలిటికల్ హీట్ తారస్థాయిలో కొనసాగుతోంది.ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.

 Damage To Brs Negative Effects , Brs, Telangana Political , Congress, Kcr, Polit-TeluguStop.com

డిసెంబర్ 3న ఫలితాలు తెలనున్నాయి.ఈసారి అధికారం కోసం బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ కొంత ముందంజలో ఉంది.ప్రచారంలోనూ ఇటు బి‌ఆర్‌ఎస్ నుంచి నేతలను ఆకర్షించడంలోనూ హస్తం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ నుంచి మరియు బీజేపీ( BJP ) నుంచి చాలమంది నేతలు హస్తం గూటికి చేరారు.దాంతో ఈసారి కాంగ్రెస్( Congress ) విజయం తథ్యం అని ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Telugu Congress, Telangana-Politics

మరోవైపు ముచ్చటగా మూడోసారి అధికారం కోసం బి‌ఆర్‌ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటివరకు జరిగిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళుతు.కాంగ్రెస్ వస్తే కష్టాలే అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు.అసలే కే‌సి‌ఆర్( KCR ) పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోందనే అభిప్రాయాలూ పెల్లుబుక్కుతున్న వేళ కాంగ్రెస్ పుంజుకోవడం బి‌ఆర్‌ఎస్ ను కొంత కలవరపెట్టె అంశం.

ఇవే కాకుండా ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ మరికొన్ని అంశాలు కలవర పెడుతున్నాయి.ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన ఎలక్షన్ గుర్తులు బి‌ఆర్‌ఎస్ ను ఇబ్బంది పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Congress, Telangana-Politics

చపాతీ కర్ర, రోడ్డు రోలర్, వంటివి కారు గుర్తును పోలి ఉండడంతో వీటి వల్ల తమ ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం ఉందని బి‌ఆర్‌ఎస్ నేతలు కలవర పడుతున్నారట.కారు గుర్తును పోలి ఉండే సింబల్స్ ఎన్నికల్లో కేటాయించరాదని బి‌ఆర్‌ఎస్ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోంది.ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టును కూడా బి‌ఆర్‌ఎస్ నేతలు ఆశ్రయించారు.అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది.అసలే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల నుంచి కారును పోలిన గుర్తులు ఎన్నికల్లో కేటాయించడం ద్వారా ఎంతో కొంత ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు.మరి ఈ ప్రతికూల ప్రభావల నుంచి బి‌ఆర్‌ఎస్ బయటపడుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube