తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి8, గురువారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.15

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.9.36 ల9.50

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

వృషభం:

Advertisement

ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు.సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

మిథునం:

ఈరోజు దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి.సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు.

కర్కాటకం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది.భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం:

ఈరోజు బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు.ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి.ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ధనవ్యవహారాలు కలసివస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య:

ఈరోజు కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది.వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

తుల:

ఈరోజు వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు.

వృశ్చికం:

ఈరోజు నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి.నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.సోదరులతో భూవివాదాలు తీర ఒప్పందాలు కుదురుతాయి.

మొండి బాకీలు వసూలవుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.భూ, క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

మీనం:

ఈరోజు విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్థి కొనుగోలు చేస్తారు.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం.

తాజా వార్తలు