భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే సీడబ్ల్యూసీ సమావేశాల ఎజెండా అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.విద్వేష రాజకీయాలను దేశం నుంచి పారద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
సరైన ఎజెండా చెప్పకుండా కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడుతుందని డీకే శివకుమార్ మండిపడ్డారు.కాగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలంతా హాజరయ్యారు.ఐదు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలతో పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఈ సీడబ్ల్యూసీ మీటింగ్స్ లో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







