తాగేసిన ప్లాస్టిక్ బాటిల్స్( Plastic Bottles ) రోడ్లపై పడేసే అలవాటు చాలామందికి ఉంటుంది.దీనివల్ల కొంత కాలంలోనే ప్రాంతాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతాయి.
చెత్తాచెదారంలో ఉన్న బాటిల్స్ నీటి మార్గాలను కలుషితం చేస్తాయి, వీటివల్ల కాలువలు మూసుకుపోతాయి.మూగ జంతువులకు కూడా ఇవి హాని కలిగిస్తాయి.
ప్లాస్టిక్ బాటిల్స్‌యే కాకుండా గ్లాస్ బాటిల్స్ కూడా జంతువులు, ప్రజలకు హాని కలిగిస్తాయి ఇవి గాయపరిచే పదునైన ముక్కలుగా విరిగిపోతాయి.ప్లాస్టిక్ సీసాలు కుళ్ళిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది, ఇవి పర్యావరణంలోకి( Environment ) హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది.
ఈ ప్రమాదాలను ప్లాస్టిక్ బాటిళ్లను డస్ట్ బీన్స్, లేదా రీసైకిల్ బిన్‌లో( Recycle Bin ) వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.దీనివల్ల మన కమ్యూనిటీలు శుభ్రంగా తయారవుతాయి.జంతువులు ప్లాస్టిక్ బాటిళ్లను ఆహారంగా పొరపాటు పడి వాటిని తింటాయి, ఇది మరణానికి దారి తీస్తుంది.ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించడం వల్ల వన్యప్రాణులను హాని నుంచి రక్షించవచ్చు.
ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది.
అయితే ఈ పని మనుషులు సరిగ్గా చేయకపోయినా ఒక కాకి( Crow ) మాత్రం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.ఈ కాకి ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తన నోట కరుచుకొని దానిని తీసుకొచ్చి ఒక రీసైకిల్ బిన్‌లో వేసింది.ఆ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
@_SJPeace_ అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను పంచుకుంది.ఒక పక్షి ఈ పని చేయగలిగింది మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్నట్లుగా దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.దీన్ని చూసిన యూజర్లు ఈ కాకికి పర్యావరణం పైన చాలా ప్రేమ ఉన్నట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోకు 1,40,000 కు పైగా వ్యూస్ వచ్చాయి.
దీనిని మీరు కూడా చూసేయండి.