జులై 15న విడుదల కానున్న తాప్సీ 'శభాష్ మిథు'.. హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సందడి

దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “శభాష్ మిథు”. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది.

 Cricketer Mithali Raj Biopic Sabhash Mithu Staring Tapsee Pannu Trailer Launched-TeluguStop.com

అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది.ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.

ప్రస్తుతం శభాష్ మిథు రిలీజ్ కు రెడీ గా ఉంది, జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధిన ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.తాప్సీ తో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొనడం గమనార్హం.

ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వేదికగా పత్రికా విలేకర్లు తో పాటు అభిమానులతో ముచ్చటించారు.

ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు.“శభాష్ మిథు” ట్రైలర్ అనూహ్య స్పందన లభించింది.వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదలకానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube