క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) వైసీపీకి రాజీనామా చేయడంపై వివరణ ఇచ్చారు.దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ -ILT20 లో ( International League -ILT20 ) పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) తరపున ఆడుతున్నట్లు అంబటి రాయుడు వెల్లడించారు.ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి టీ 20 లీగ్ లో ఆడుతున్నానని తెలిపారు.
ప్రొఫెషనల్ గేమ్ ఆడేందుకు గానూ రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండకూడదన్న ఆయన ఈ కారణంగానే వైసీపీని( YCP ) వీడినట్లు స్పష్టం చేశారు.అయితే గత నెలలో సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా అంబటి రాయుడు రాజీనామాపై పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.