మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.ఈయన గత సినిమా ఆర్ఆర్ఆర్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game Changer ) ఒకటి.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో శంకర్( Shankar ) ప్లాన్ చేసిన సాంగ్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది.చరణ్ పై ఈ సినిమాలో ఒక భారీ సాంగ్ ను ప్లాన్ చేసాడని అతి త్వరలోనే ఈ సాంగ్ షూట్ స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సాంగ్ ఎలాంటిది అనే విషయం బయటకు రావడంతో మరింత వైరల్ అవుతుంది.ఈ సాంగ్ ఇప్పటి నీచమైన రాజకీయ పరిస్థితులకు( political conditions ) అద్దం పట్టేలా ఉంటుందట.ఈ రాజకీయ పరిస్థితులను చూసి విసిగిపోయిన ఒక వీరుడు ఏం చేసాడు? ఏం చేయబోతున్నాడు? అనే కొనాలో ఈ సాంగ్ సాగుతుందట.ఈ పవర్ఫుల్ సాంగ్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
ఇక ఈ సినిమా కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.