ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్, ప్రథమ చికిత్స కీలకం - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: గురువారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని కె -కన్వెన్షన్ హాల్ లో జిల్లా పోలీస్ సిబ్బందికి, బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బందికి సీపీఆర్,ప్రథమ చికిత్స & బేసిక్ లైఫ్ సపోర్ట్ మరియు దాని ప్రాముఖ్యత పై మెడి లైఫ్ హాస్పిటల్ మంచిర్యాల, రేనే హాస్పిటల్ కరీంనగర్ నిపుణులైన డాక్టర్స్ చేత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ చాలా సార్లు, తక్షణ సౌకర్యాలు లేక సహాయం లేకపోవడం వల్ల రోడ్డుపై అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా ప్రజలు మరణిస్తున్నారు.

ఇలాంటి సమయాల్లో, బాగా శిక్షణ పొందిన, బ్లూ క్లోట్స్,పెట్రో కార్ సిబ్బంది, పోలీసు అధికారులు నిజంగా ఒక ప్రాణాన్ని రక్షించడంలో సహాయపడగలడు.దీన్ని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం జిల్లాలో ఉన్న సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, మరోసారి జిలాల్లో పని చేస్తున్న సిబ్బందికి, పెట్రో కార్,బ్లూ కోల్ట్ సిబ్బందికి మెడి లైఫ్, రేనే హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రెండవ దశ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పోలీసు అధికారులు, సిబ్బందికి సిపిఆర్ ,ప్రథమ చికిత్స, బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి తెలుసుకుంటే విధినిర్వహణలో భాగంగా సామాన్య ప్రజలకు మెడికల్ ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు సాధ్యమైనంత వరకు వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయిన్నారు.శిక్షణ కార్యక్రమంలో మొదట బొమ్మపై లైఫ్ సపోర్ట్ స్కిల్స్ గురించి డాక్టర్స్ ప్రాక్టికల్ గా చేసి చూపించారు.

మళ్ళీ సిబ్బంది తో కూడా చేపించడం జరిగింది.సిబ్బంది ఉత్సాహంగా తమ నైపుణ్యాలను ప్రదర్శించారు మరియు సిబ్బంది టెక్నిక్ లు నేర్చుకోవడంలో, పాటు సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది.

Advertisement

ఎస్పీ వెంట అధనవు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయ్ రెడ్డి, డాక్టర్లు కుమారస్వామి, దీక్షిత్, వంశీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News