జీవో నెంబర్ 22 ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి!

బిజేపి, కమ్యూనిస్టులకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి.అందువల్లనే దేశంలో అందరూ కలిసినా వీరిరువురు మాత్రం కలవరు.

ఎందుకంటే వీరి సిద్ధాంతాలు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి.అందుకే కమ్యూనిస్టులను లెఫ్టిస్టులుగా బిజేపి మరియు ఇతర బిజేపి సంస్థలను లైటిస్టులుగా పిలుస్తుంటారు.

Andhrapradesh Cpi RamaKrishna Sensational Comments On Ap Governament CPI, Ramakr

ప్రస్తుతం బిజేపి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది.దీనితో కమ్యూనిస్టులు ఎప్పుడు బిజేపి ప్రభుత్వంపై గ్యాప్ లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మోడీ తీసుకువచ్చే సంస్కరణలకు గుడ్డిగా సరే అనటం ఎంతమాత్రం తగదని.ఉచిత విద్యుత్ కు మీటర్ల బిగింపు ప్రక్రియ రైతుల పొట్టలు కొడుతుందని అందుకే ఈ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విముఖత చూపారని కాని జగన్ మాత్రం దీనికి సరే అనటం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.

Advertisement

అంతేకాకుండా జీవో నెంబర్ 22 ఉపసంహరించుకోవాలని లేకుంటే శ్రీకాకుళం నుండే మరో విద్యుత్ పోరాటం ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మరి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇచ్చిన హెచ్చరికపై ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా ఒకవేళ స్పందించకపోతే సీపీఐ తాము ప్రకటించినట్లు నిజంగానే ఉద్యమం చేస్తుందా అనేది వేచి చూడాలి .

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు