సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారని నారాయణ తెలిపారు.అయితే చంద్రబాబు వారిని కలిసేందుకు ఒప్పుకోలేదన్నారు.
ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు తెలుసని, ఈ క్రమంలోనే మద్ధతు కోసం చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు ఉండటం వలనే కేసీఆర్ బీజేపీకి తలొగ్గారని తీవ్రంగా విమర్శలు చేశారు.
అయితే కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నన సీపీఐ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.







