వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు.
లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.టిడ్కో ఇళ్ల కాలనీల్లో కరెంట్, రోడ్లు, డ్రైన్లు లేవని ఆరోపించారు.
కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు.వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.
సీఎం జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పేదలకు టిడ్కో ఇళ్లను అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.