తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్( Telangana New Governor CP Radhakrishnan )ప్రమాణస్వీకారం చేశారు.ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో సీపీ రాధాకృష్ణన్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు.అయితే లోక్ సభ ఎలక్షన్ కోడ్( Lok Sabha Election Code ) ముగిసిన తరువాత తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.