ప్రపంచాన్నిశాసించే స్థితిలో ఉన్న భారత్... ఇదే గొప్ప అవకాశం

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది.ఇక కరోనా బాధితుల సంఖ్య ఇతర దేశాలలో లక్షల సంఖ్యలో ఉన్నారు.

 India Biggest Producer Of 'game-changer' Hydroxy Chloroquine, Covid-19, Anti Mal-TeluguStop.com

ఇక ఈ కరోనాకి ట్రీట్మెంట్ కోసం యాంటీ మలేరియా మెడిసన్ అయిన క్లోరోక్విన్ ని ఉపయోగిస్తున్నారు.కరోనా రాకుండా జాగ్రత్త కోసం దీనిని వాడుతున్నారు.

ఈ మందును ప్రపంచంలో ఎక్కువగా తయారు చేస్తున్నది ఇండియానే.మన దేశం నుంచే ఇతర దేశాలకి సప్లై అవుతుంది.క్లోరోక్విన్ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి దాకా దేశం నుంచి 1,900 కోట్ల డాలర్ల విలువైన మందులు ఇండియా నుంచి ఎగుమతి అయ్యింది.అందులో క్లోరోక్విన్ వాటా సుమారు 122 కోట్ల డాలర్లు ఉంది.

కరోనా నేపధ్యంలో దీని నివారణకి క్లోరోక్వీన్ ని ఉపయోగించడం వలన ప్రస్తుతం ఇండియా ఈ మెడిసన్ ఎగుమతి మీద ఆంక్షలు విధించింది.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​ కోరడంతో బ్యాన్ పై రూల్స్​ను సడలించింది.మన కోసం ప్రత్యేకంగా 10 కోట్ల ట్యాబ్లెట్ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.క్లోరోక్విన్​ ని చైనా తయారు చేయకపోవడం వల్ల, ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న అన్ని దేశాలు ఇండియా మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.ప్రస్తుతం దేశంలో ప్రతి నెలా 40 టన్నుల ట్యాబ్లెట్లు తయారవుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా వచ్చే నెల నాటికి ప్రొడక్షన్ కెపాసిటీని 70 కోట్లకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.ప్రపంచ దేశాలు ఇండియాని ఇప్పుడు ఈ మెడిసన్ కోసం అభ్యర్దిస్తున్నాయి.

ఈ అవకాశాన్ని ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube