బీజేపీలో కోవర్ట్ ల కలకలం.. ఆ విషయంలోనే బయటపడిందా?

తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే గడువు ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనుకుంటున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా బీజేపీలో అంతర్గతంగా చర్చ జరిగిన ఓ విషయం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

జీవో 317 కు వ్యతిరేకంగా బండి సంజయ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.అయితే దీక్ష కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని పోలీసులు బండి సంజయ్ ను ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

అయితే బండి సంజయ్ అరెస్ట్ జారిన రెండు రోజుల పాటు బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.అయితే బండి సంజయ్ విడుదల అయ్యే వరకు తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని తద్వారా బీజేపీ అనేది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని వ్యూహం పన్నారు.

Advertisement

అయితే బీజేపీ చాలా సీక్రెట్ గా తీసుకున్న నిర్ణయం కేసీఆర్ వరకు చేరిందని అందుకే బండి సంజయ్ కు రెండు రోజుల్లోనే బెయిల్ వచ్చిందని లేకపోతే బెయిల్,అంత సులభంగా వచ్చేది కాదని పార్టీకి చెందిన ఓ కీలక నేత కెసీఆర్ కు బీజేపీ పార్టీ లో జరుగుతున్న చర్చలన్నింటినీ కేసీఆర్ పూసాగుచ్చినట్టు చెబుతున్నారని బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు