ప్రపంచంలో అత్యధిక గోల్డ్ రిజర్వులు( Highest Gold Reserves ) ఉన్న దేశాలలో అమెరికా అగ్రస్థానంలో ఉంది.అమెరికాలో 8133 టన్నుల బంగారం రిజర్వ్ రూపంలో ఉంది.
ఈ బంగారంలో చాలా వరకు అంతా బిస్కెట్లు, బ్రిక్స్ రూపంలో ఉంది.
ఇక ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక గోల్డ్ రిజర్వులు ఉన్న దేశాలలో జర్మనీ 2వ స్థానంలో ఉంది.
జర్మనీ వద్ద 3355 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.యూరప్ కు చెందిన జర్మనీ మొదటి నుంచి అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తూ నాణ్యమైన కార్లను తయారు చేయడమే కాకుండా రకరకాల ఉత్పత్తుల తయారీలో జర్మనీ( Germany ) తన బ్రాండ్ ని బాగా ప్రచారం చేసుకుని సక్సెస్ అయింది.

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఇటలీ( Italy ) ఉంది.ఇటలీ వద్ద 2452 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.నాలుగవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది.ఫ్రాన్స్ వద్ద 2437 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.ఐదవ స్థానంలో రష్యా ఉంది.రష్యా వద్ద 2330 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.
ఆరవ స్థానంలో చైనా ఉంది.చైనా వద్ద 2113 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.ఏడవ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది.స్విట్జర్లాండ్ వద్ద 1040 టన్నుల బంగారు రిజర్వు ఉంది.8వ స్థానంలో జపాన్ 846 టన్నుల బంగారు రిజర్వ్ తో ఉంది.
మన భారతదేశం ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది.
మన భారతదేశం వద్ద 797 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.ఈ జాబితాలో పదవ స్థానంలో నెదర్లాండ్స్( Netherlands ) ఉంది.
నెదర్లాండ్స్ వద్ద 612 టన్నుల బంగారు రిజర్వ్ ఉంది.

మన భారతదేశ ప్రభుత్వం( Indian Government ) 1990లో బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దగ్గర తాకట్టు పెట్టింది.ఆ స్థితి నుంచి తేరుకొని ప్రస్తుతం అమెరికా సహా చాలా దేశాల బాండ్లను కొంటూ వాటిని అప్పుల ఊబి నుంచి భారతదేశం కాపాడుతోంది.ప్రస్తుతం భారత ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉంది.
అవసరం లేకపోయినా ఎందుకైనా మంచిదని బంగారాన్ని రిజర్వ్ రూపంలో స్టోర్ చేస్తోంది.
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో ఉండే బంగారాన్ని( Gold ) తాకట్టు పెట్టి అవసరాలను తీర్చుకుంటాం.
అలాగే ప్రపంచ దేశాల ప్రభుత్వాలు లేదా సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వల్ని ఉంచుకుంటున్నాయి.ప్రామిసరీ నోట్లు, కరెన్సీ విలువ పడిపోకుండా ఉండేందుకు అంతర్జాతీయ అప్పులను తీర్చేందుకు ఈ నిల్వలు ఉపయోగపడతాయి.







