లాక్ డౌన్ పొడిగింపు పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కరోనా మహమ్మారి

ప్రపంచ దేశాలను అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే దాదాపు 7 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు నమోదు కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 30 వేలు దాటిపోయింది కూడా.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు కొన్ని

లాక్ డౌన్

ను ప్రకటించాయి.

సోషల్ డిస్టెన్స్

అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి అన్న ఉద్దేశ్యం తో చాలా దేశాలు కూడా ఈ లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు.

అయితే లాక్ డౌన్ ప్రకటించిన దేశంలో భారత్ కూడా ఉన్న విషయం తెలిసిందే.తొలుత ఒక వారం పాటు లాక్ డౌన్ అని ప్రకటించిన కేంద్రం ఆ తరువాత ఆ సమయాన్ని 21 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనితో ఎవరూ కూడా

ఏప్రిల్ 14

వరకు ఇళ్లు వదిలి బయటకు రావద్దు అంటూ

ప్రధాని మోడీ

చేతులు జోడించి మరి ప్రజలను కోరారు.అయితే లాక్ డౌన్ ను మరికొద్ది కాలం పొడిగిస్తారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

అయితే ఈ విషయంపై కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించవచ్చునని వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది.

ఇవి వదంతులు మాత్రమేనని, వీటిని చూసి తాను ఆశ్చర్యపోయానని

కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

అన్నారు.పొడిగింపు వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు.

వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిధ్ధపడడంతో కేంద్రం లాక్ డౌన్ కాల పరిమితిని పొడిగించే సూచనలున్నాయంటూ కొన్ని పత్రికల్లో

వార్తలు

కూడా రావడం తో ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుమానం బలపడింది.

దీనితో కేబినెట్ కార్యదర్శి స్పష్టత ఇవ్వడం తో ఇవి వట్టి పుకార్లే అని అర్ధం అవుతుంది.అసలు ఈ విధమైన ప్రతిపాదన అనేది ప్రభుత్వానికి లేదంటూ గౌబా పేర్కొన్నారు.ఏప్రిల్ 14 తో ఈ లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుంది అంటూ ఆయన స్పష్టత ఇచ్చారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు