దేశంలో కరోనా వైరస్ సరికొత్త లెక్కలు..!!

చాలా వరకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

శీతాకాలంలో కంట్రోల్లో ఉన్నాగాని సరిగ్గా ఎండాకాలం మొదలవుతున్న తరుణంలో ఉన్నట్టుండి రాష్ట్రాలలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగటం కేంద్ర ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి.

ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా గానీ కేసులు పెరగటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఇదిలా ఉంటే దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,584 కావటంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరింది.

అయితే వీరిలో 1,07,12,665  మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వడంతో మొత్తం మీద 1,47,306  కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడచిన 24 గంటల్లో 78 మంది కరోనా వైరస్ మృతి చెందటంతో ఇండియాలో మహమ్మారి కరోనా వలన మరణించిన వారి సంఖ్య 1,56,463  కు చేరింది.

మొత్తంమీద ఇటీవల కేసులు దేశంలో ఉన్న కొద్ది పెరుగుతుండటంతో కేంద్రంలో టెన్షన్ మొదలైంది.  .

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు