బ్రహ్మోత్సవాల ముందు .. టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి కి పాజిటివ్ !

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతుంది.ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షల చేరువ అయింది.

 Ttd Chairman Yv Subbareddy , Ycp Leader Yv Subbareddy, Yv Subbareddy, Ycp, Ys-TeluguStop.com

రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది కరోనా బారిన పడ్డారు.

ఇక తిరుమలలోను పలువురు ఉద్యోగులకి , అర్చకులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

ఇక తాజాగా టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది.దీనితో సుబ్బారెడ్డి హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు .అయితే సుబ్బారెడ్డికి కరోనా సోకడం మీద వైసీపీ పార్టీలో అలానే సీఎం జగన్ కుటుంబంలో కూడా ఆందోళన నెలకొంది.వై వి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా కూడా ఆయన పని చేశారు.

గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా, రాష్ట్రం అంతా సమన్వయ పరిచే బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు.

అయితే ,రేపటి నుండి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి.ఈ సమయంలో టీటీడీ ఛైర్మెన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో తిరుమలలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.

ఇకపోతే, ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,67,465కు చేరుకున్నాయి.నిన్న ఒక్కరోజే 28 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో 6,319కు చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube