కరోనా బారిన పడిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌‌.. !

దేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఎవరిని వదలడం లేదు.తన చేతికి చిక్కిన వారిని చిక్కినట్లుగా పలకరిస్తూ వెళ్లుతుంది.

ఇది వరకే ఎందరో రాజకీయ ప్రముఖులతో పాటుగా సెలబ్రెటీలను కూడా లక్ష్యంగా చేసుకున్న కోవిడ్ ఏ మాత్రం అవకాశం చిక్కిన చటుక్కున పట్టేసుకుంటుంది.ఈ క్రమంలో రోజు రోజుకు కరోనా కేసులు ఊహించని విధంగా నమోదు అవుతున్నాయి.

Corona Infected Rss Chief Rss Chief, Mohan Bhagwat, Corona Positive, Covid 19,

ఇదే క్రమంలో రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.కాగా ఈయనకు సాధారణ లక్షణాలు కనిపించడం తో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అనే విషయం తేలిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది.

ఈ నేపధ్యంలో మోహన్‌ భగవత్ ను నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం.ఇకపోతే భగవత్‌ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారన్న విషయం తెలిసిందే.

Advertisement
ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!

తాజా వార్తలు