చైనాలో కరోనా.. కొత్త వేరియంట్ మొదలైందట.. !

దేశమంతా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా పార్ట్ పార్ట్‌లుగా వస్తూ ప్రజలతో కబడ్ది ఆడుతుంది.

 Corona In China Before The New Variant Started, Corona, China, New Variant, Star-TeluguStop.com

ఇక ఈ వైరస్ కు మూలకారణం చైనా దేశమని అందరు అంటున్న విషయం తెలిసిందే.

ఈ కరోనా మొదటి వేవ్ లో చైనాలో చాలా భీభత్సమైన పరిస్దితులు నెలకొన్నాయి.

కానీ సెకండ్ వేవ్ మాత్రం మనదేశం పై తీవ్ర స్దాయిలో విరుచుకుపడింది.కాగా మూడో వేవ్ ఉందని ఇప్పటికే ఆరోగ్య సంస్దలు హెచ్చరిస్తున్నాయి.

ఇక కోవిడ్ కట్టడికి వ్యాక్సిన్స్ ఇస్తున్నా దీని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు.ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదు అవుతున్నాయట.

అయితే ఈసారి మాత్రం ఈ కోరోనా కొత్త వేరియంట్ అంటున్నారట ఇక్కడి అధికారులు.కాగా తాజాగా, గ్వాంగ్జౌ నగరంలో 20 కొత్త కేసులను గుర్తించారట.

ఇక 20 పాజిటివ్ కేసులంటే పెద్ద విషయమేమీ కాకపోయినా, తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా మొదలవుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ మాత్రం ఇది కొత్త వేరియంట్ అని వెల్లడించిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube