తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజూ వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
నిలకడగా ఉంటూనే కరోనా వ్యాప్తి పెరుగుతోంది.ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా కేసులు పెరిగాయి.
ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు.ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4 ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది.
కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగితే కేసుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు.ప్రభుత్వమే తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.ఇందులో గడిచిన 24 గంటల్లో 2,795 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,14,483 కి చేరింది.కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 8 మంది మరణించారు.
దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించివారి సంఖ్య 778కి చేరింది.ఇప్పటివరకు 86,095 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 యాక్టివ్ కేసులు ఉన్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలో 449, ఖమ్మంలో 152, నల్గొండలో 164, రంగారెడ్డిలో 268 కేసులు నమోదయ్యాయి.







