సీనియర్ నటి కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన కరోనా.. !

ప్రస్తుతం సమాజంలో కరుడుగట్టిన నేరస్దుడు ఎవరంటే కరోనా అని టక్కున సమాధానం వస్తుంది.ఈ వైరస్ చేసే హత్యలను ఏ ప్రభుత్వం కూడా ఆపలేక పోయింది.

అలాగే ఈ వైరస్ కు శిక్షవిధించే ఆస్కారం కూడా లేకుండా పోయింది.లోకంలోని ఎన్ని కుటుంబాలను బలి తీసుకుందో లెక్కించడం కష్టం.

Senior Actress Kavitha Husband Died Of Corona, Actress Kavitha, Kavitha Husband

దాదాపుగా కొన్ని బ్రతుకులను అయితే పూర్తిగా చీకట్లోకి నెట్టేసి ఫ్యామిలీ మొత్తాన్ని బలి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.మొత్తానికి మనుషులకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ కరోనా సీనియర్ నటి కవిత కుటుంబలో ఎన్నటికి తీరని విషాదాన్ని నింపింది.

ఇటీవలే కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మరణించగా, తాజాగా ఆమె భర్త దశరథరాజు నేడు కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న దశరథరాజు పరిస్దితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.

Advertisement

ఇకపోతే 1984లో కవిత, దశరథరాజులకు వివాహం జరుగగా ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఇక ఇటీవల కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే.

కాగా రెండు వారాల వ్యవధిలో కవిత భర్త కూడా మరణించడంతో తీరని శోకంలో మునిగిపోయారు ఈ సీనియర్ నటి.

Advertisement

తాజా వార్తలు