మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం

తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్టులో కరోనా కలకలం చెలరేగింది.విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో చైనా నుంచి వచ్చిన ఇద్దరు తల్లీకూతుళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 Corona Chaos At Madurai Airport-TeluguStop.com

ఈ క్రమంలో ఇద్దరి శాంపిల్స్ ను వైద్యాధికారులు ల్యాబ్ కు పంపారని సమాచారం.మరోవైపు మధురై ఎయిర్ పోర్టులో ప్రయాణికులందరికీ సిబ్బంది కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

వీరిలో 20 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది.

ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube