వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడిలో ఉగాది ఉత్సవాల నిర్వహణపై వివాదం రాజుకుంది.ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు రూ.25 వేలు డిపాజిట్ చేయాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది.ఈ మేరకు ఈనెల 17న కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సర్క్యులర్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్క్యులర్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాఖ్యనించారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు.డిపాజిట్ విధానం సరైంది కాదని పలు వాదనలు వినిపిస్తున్నాయి.