విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఆలయ ఈవోకు కోర్టు ధిక్కరణ నోటీసులు అందాయి.ఈ మేరకు ధిక్కరణ కేసులో కోర్టుకు హజరుకావాలని ఈవో భ్రమరాంబకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
రెగ్యులరైజేషన్ లో అన్యాయం జరిగిందని ఆలయ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.జూనియర్లను రెగ్యులర్ చేసి తమను పక్కన బెట్టారన్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు పంపినా ఈవో స్పందించలేదని తెలుస్తోంది.దీంతో ధిక్కరణ కేసులో భాగంగా ఈవో భ్రమరాంబ రేపు కోర్టులో హాజరుకానున్నారు.







