ఈ గింజలు రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే మీ గుండె పదిలమే!

ఇటీవల రోజుల్లో గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

ఆహారపు అలవాట్లు, జీవనశైలి లో చోటు చేసుకున్న మార్పులు గుండెకు ముప్పు పెంచుతుంది.

అందుకే గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో మేలు చేస్తాయి.

గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గించడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి.ఇక‌పోతే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి కావు.

ఆహారాల ద్వారానే వాటిని పొందాలి.అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో అధికంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.

Advertisement
Consuming These Seeds Daily Keeps The Heart Healthy! Healthy Heart, Heart Health

కానీ, చేపల కంటే చియా సీడ్స్ ద్వారానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అధిక మొత్తంలో పొందొచ్చు.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ను వేసి గంట పాటు నానబెట్టాలి.

Consuming These Seeds Daily Keeps The Heart Healthy Healthy Heart, Heart Health

గంట అనంతరం వాటర్ తో సహా చియా సీడ్స్ ను తీసుకోవాలి.ఈ విధంగా చేస్తే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.పది కాలాల పాటు గుండె పదిలంగా ఉంటుంది.

అంతే కాదు రోజుకు రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ ను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా మారుతుంది.

Consuming These Seeds Daily Keeps The Heart Healthy Healthy Heart, Heart Health
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.శరీరంలో వాపులను తగ్గించడంలో చియా సీడ్స్ ప్రభావవంతంగా పని చేస్తాయి.

Advertisement

మరియు మైగ్రేన్ తలనొప్పి నుంచి విముక్తిని కలిగించడానికి సైతం చియా సీడ్స్ ఉత్త‌మంగా సహాయపడతాయి.కాబట్టి తప్పకుండా చియా సీడ్స్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు