కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీ ఎస్ ) ఈ రోజు మృతి చెందారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన డి శ్రీనివాస్( D Srinivas ) ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని( Hyderabad ) ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు.

ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతోనే డిఎస్ మరణించినట్లుగా కుటుంబ సభ్యులు  చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అధ్యక్షుడిగా , వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా డి.ఎస్ పని చేశారు.1948 సెప్టెంబర్ 27న డిఎస్ జన్మించారు నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన,  1989లో కాంగ్రెస్ లో చేరి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఆ తరువాత 2004,  2009లో ఎమ్మెల్యేగా గెలిచారు నిజామాబాద్ కు( Nizamabad ) చెందిన డీఎస్ ఎక్కువకాలం కాంగ్రెస్ లో లోని ఉన్నారు.  వివిధ పదవులు అనుభవించారు.ఏపీ,  తెలంగాణ విభజన తర్వాత డిఎస్ బీఆర్ఎస్ పార్టీలో( BRS ) చేరారు.

  రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.ఆ తర్వాత  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో( Congress ) చేరారు.

Advertisement

చాలా కాలంగా అనారోగ్యంతో ఉండడంతో ఆయన యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొనడం లేదు.ఇక డిఎస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్( Dharmapuri Sanjay ) గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్( Dharmapuri Aravind ) రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు .ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్నారు.డిఎస్ మృతిపై, అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రులు సీతక్క , గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం పభాకర్ ,  చెన్నూరు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు డిఎస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు