కాంగ్రెస్ రివర్స్ ప్లాన్.. !

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress party )విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి రాజకీయాలన్నీ తారుమారు అయ్యాయి.అప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం అయింది.

 Congress Reverse Plan, Congress Party . Bjp Party , Brs Party , Dk Shivakumar-TeluguStop.com

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఆ తరువాత కూడా ఈ రెండు పార్టీల మద్య వార్ మరో మలుపు తిరిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కుల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందనే వార్తలు రావడంతో ఒక్కసారిగా మళ్ళీ కన్నడ పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే పలు మార్లు ప్రస్తావించడంతో కర్నాటకలో ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతూ వచ్చింది.

Telugu Brs, Congress, Dk Shivakumar, Revanth Reddy, Siddaramaiah-Politics

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింగపూర్ లో ప్రణాళికలు జరుగుతున్నాయని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెప్పడం గమనార్హం.ఆ తరువాత కాంగ్రెస్ కు చెందిన 20 మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని కమలనాథులు ప్రకటించి సంచలనానికి తెరతీశారు.దీంతో సిద్దిరామయ్య ( Siddaramaiah )సర్కార్ లో ఆందోళన మొదలైంది.ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలను కూల్చి అధికారం చేజిక్కించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.దాంతో బీజేపీ ఉచ్చులో తమ ఎమ్మేల్యేలు పడే అవకాశం ఉందని హస్తం నేతలు ఆందోళన చెందుతూ వచ్చారు.ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలకు పదును పెట్టిన కాంగ్రెస్.

రివర్స్ ఎటాక్ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది.

Telugu Brs, Congress, Dk Shivakumar, Revanth Reddy, Siddaramaiah-Politics

తమ ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చూసుకుంటూనే బీజేపీలోని ఎంపీలను ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు దగ్గరపడడంతో బీజేపీకి చెందిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో ఉంది హస్తం పార్టీ.తమ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ తో పాటు కీలక బాద్యతలు అప్పజెపుతామని హామీలు గిప్పిస్తున్నారట కాంగ్రెస్ నేతలు.

దాంతో బీజేపీ లోని కొందరు నేతలు హస్తం పార్టీవైపు అడుగులు వేస్తున్నారట.ఇప్పటికే బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు డికె శివకుమార్( DK Shivakumar ) తో టచ్ లో ఉన్నారని సమాచారం.

మొత్తానికి కాంగ్రెస్ ను దెబ్బ తీయాలని బీజేపీ చూస్తుంటే.రివర్స్ గా కాంగ్రెసే బీజేపీని దెబ్బకొట్టేందుకు ముండగుడులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube