తెలంగాణలో నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , వారిని తమవైపు తిప్పుకుంటే కాంగ్రెస్ విజయానికి డొకా ఉండదు అనే అంచనాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే నిరుద్యోగుల విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు రేవంత్ మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేస్తుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఆ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్( Employment Notification ) లు రాలేదని, కెసిఆర్ ఉద్యోగం ఊడగొడితీనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు.
నిరుద్యోగ యువత( Unemployed Youth ) కేవలం 50 రోజుల సమయం కేటాయించి , ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడు తప్పకుండా మేలు జరుగుతుందని రేవంత్ చెబుతున్నారు. లక్షలాదిమంది నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు జల్లిందని రేవంత్ విమర్శించారు.
“మిస్సింగ్ కిడ్ “( Missing Kid ) అంటూ కేటీఆర్ తన కుమారుడు హిమాన్షు ఫోటో( KTR Son Photo )ను ట్విట్టర్ లో షేర్ చేశారు .దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.” దూరంగా ఉన్న బిడ్డ గుర్తొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.కొడుకుతో కొద్ది రోజులు ఏడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా , ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి ముఖం చూడని లక్షలాదిమంది నిరుద్యోగుల తల్లితండ్రుల ఆవేదన నీలా. కాదనుకున్నావా ? కొడుకు తిరిగి రాక పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబం వేతన నీలా కాదనుకున్నావా ? తిండి పెట్టక చిన్నారులను ఏడిపించి ఫీజు బకాయిలు ఇవ్వక యువతని గోస పెట్టి , ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుంది ”’ అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు.