మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కాస్త బలపడింది.

వైయస్ షర్మిల ( YS Sharmila )అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాక.కాంగ్రెస్ పేరు ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ ఏడాది జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన షర్మిల.పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం జరిగింది.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని.ఇంకా పలు హామీలు ప్రకటిస్తూ ఉంది.

Advertisement

ఈసారి ఎన్నికలలో కడప ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో జాబితా విడుదల చేయడం జరిగింది.6 లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

లోక్ సభ స్థానాలు బట్టి చూస్తే విశాఖ నుండి సత్యనారాయణ రెడ్డి( Satyanarayana Reddy ), అనకాపల్లి నుండి వేగి వెంకటేష్, ఏలూరు నుండి లావణ్య కావూరి, నరసరావుపేట నుండి గర్నెపూడి అలెగ్జాండర్, నెల్లూరు నుండి కొప్పుల రాజు, తిరుపతి నుండి చింతా మోహన్ పేర్లను ప్రకటించింది.అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే టెక్కలి నుండి కిల్లి కృపారాణి( Killi Krupa Rani ), భీమిలి నుండి ఆదాల వెంకటరామరాజు, విశాఖపట్నం సౌత్ నుండి వాసుపల్లి సంతోష్, గాజువాక నుండి లక్కరాజు రామారావు, అరకు వ్యాలీ నుండి శెట్టి గంగాధర స్వామి, నర్సీపట్నం నుండి రౌతుల శ్రీరామమూర్తి, గోపాలపురం నుండి శోదదాసి మార్టిన్ లూథర్, ఎర్రగొండపాలెం నుండి డాక్టర్ శ్రీమతి బుద్దాల అజిత్ రావు, పర్చూరు నుండి శ్రీమతి నల్లగొర్ల శివ శ్రీ లక్ష్మీ జ్యోతి, సంతనూతలపాడు నుండి వైజస్ రాజ్ పాలపర్తి, గంగాధర నెల్లూరు నుండి రమేష్ బాబు దెయ్యాల, పూతలపాటు నుండి ఎమ్మెస్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు