ఏపీలో పొత్తులపై కాంగ్రెస్( Congress ) క్లారిటీ ఇచ్చింది.మత విద్వేషాన్ని ప్రదర్శించే బీజేపీతో( BJP ) తాము రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్( Manickam Tagore ) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అదేవిధంగా బీజేపీతో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనతోనూ పోరాటం చేస్తామని మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.బీజేపీతో వైసీపీ( YCP ) అనైతిక బంధంలో ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే ఏపీలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన మరియు వైసీపీకి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.అయితే ఇండియా కూటమి( India Alliance ) పార్టీలతో కలిసి పోరాడుతామని ఆయన వెల్లడించారు.