కర్ణాటక సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేసింది.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
సీఎంగా సిద్ధరామయ్య ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారన్నారు.అదేవిధంగా లోక్ సభ ఎన్నికలు అయ్యేంత వరకు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గానూ కొనసాగుతారని తెలిపారు.
సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్యను శాసనసభా పక్షనేతగా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.







