గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.

రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీజేపీపై అసత్య ప్రచారం చేస్తోందని ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman )మండిపడ్డారు.ఓటమి భయంతో కుట్రపూరితంగా ఇటువంటి ప్రచారాలు చేస్తుందని ధ్వజమెత్తారు.

మతపరమైన రిజర్వేషన్లతో ఓట్ల కోసం కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందని ఆయన ఆరోపణలు చేశారు.వర్గాల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను పొందాలని చూస్తోందన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చింది బీజేపీ (BJP)అని తెలిపారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు