కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కూడా కరోనా....

"ఇందు గలడందు లేడన్న సందేహం వలదు, డెం దెందు వెతికిన నందందే కలడు" ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్న పోతన పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా అలానే ఉన్నాయి.

ధనికులు,సామాన్యులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కూడా ఈ కరోనా పలకరిస్తూ ఉండడం కలవరం కలిగిస్తుంది.ఈ కరోనా కి సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఒక్కొక్కరు బలవుతున్న విషయం విదితమే.

Congress MP Komatireddy Venkat Reddy Tested Corona Positive Telangana, Coronavi

గత అర్ధ రాత్రి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే.గత కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆ మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ నిమోనియా చేరడం తో ఆసుపత్రిలో నే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.

ఇలా ప్రజా ప్రతినిధులు సైతం ఈ కరోనా బారిన పడుతుండడం జనాల్లో ఆందోళన మరింత పెరిగిపోతుంది.గల్లీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.

Advertisement

అయితే వీరిలో కొందరు కోలుకుంటున్నప్పటికీ కొంతమంది మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు.అయితే ఇప్పుడు తాజాగా, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.అయితే ఆయన కు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం తో ప్రస్తుతం ఇంటిలోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం.

అయితే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో ఆయనను కలిసిన నేతలు,నాయకులూ,ప్రజలు అందరూ కూడా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు