హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.విచారణ నేపథ్యంలో ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
ఇటీవలే బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ ఇవాళ విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ నోటీసులు అందించారు.
ఈ క్రమంలో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ పై అధికారులు నేతల నుంచి వివరాలు రాబట్టనున్నారని తెలుస్తోంది.అయితే ఇవాళ పార్టీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని కేఎల్ఆర్ అధికారులకు చెప్పారని తెలుస్తోంది.







