విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కాంగ్రెస్ నేత దుబ్బాక

నల్లగొండ జిల్లా:ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది.

ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టీపీసీసీ డెలికేట్ దుబ్బాక నరసింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలపరంగా ముందుకు సాగుతూ భవిష్యత్ లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాక్షించారు.యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసమే క్రికెట్ టోర్నమెంట్ లు ఏర్పాటు చేయడం పెరుగుతుందని అన్నారు.ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించిన వారికి ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు మరియు షీల్డ్స్ ప్రదానం చెయ్యడం జరిగింది.

Congress Leader Dubbaka Distributed The Prizes To The Winners , Nalgonda Distric
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు