కులగణన దేశానికి ఎక్స్ రే వంటి దని తాము అధికారం లోకి వచ్చిన ఆరు నెలల లోపే ఈ కులగణనను చేపట్టి దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉండిపోయిన అనేక వర్గాలకు సమన్యాయం చేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టి న బస్సు యాత్ర రోజు రోజుకు మరింత జోష్ తో ముందుకు సాగుతుంది.
కరీంనగర్లో బస్సు యాత్ర( Congress Bus Yatra )ను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టింది .తెలంగాణ ప్రజలు ప్రజా తెలంగాణను కోరుకుంటే ఇక్కడ దొరల తెలంగాణ వచ్చిందని, కేసీఆర్( CK KCR ) తెలంగాణకు నియంతలా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు .తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కులగణన సెన్సెస్ తోనే పూడుస్తామని రాహుల్ గాంధీ జగిత్యాల సభలో హామీ ఇచ్చారు.తాము అధికారంలోకి రాగానే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ( Mutyampeta Sugar Factory )ని తెరిపిస్తామని, పసుపు రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు .
వచ్చే ఎన్నికలు ప్రజా తెలంగాణకు దొరల తెలంగాణకు మధ్య పోటీ అని తమ పార్టీతో ప్రజలకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు.తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు కాంగ్రెస్ కు బాగా తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్న సర్వే రిపోర్ట్ లతో కాంగ్రెస్లో రోజురోజుకు ఉత్సాహం వెళ్లి విరుస్తుంది .
దానికి తగ్గట్టే కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు .తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా రాహుల్ గాంధీ( Rahul Gandhi ) బిఆర్ఎస్ – బిజెపి ఒకటే అనే ప్రచారానికి అధికంగా ప్రాముఖ్యతను ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది .తన ప్రతి సభలోను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రసంగిస్తున్న రాహుల్ కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి అని నొక్కి వక్కాణిస్తునారు.తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని తన ఇల్లును తీసుకున్నారని కానీ నాకు దేశమంతా ఇల్లే అంటూ రాహుల్ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు.