కాంగ్రెస్ తోనే ముప్పు ! బీజేపీ ని పట్టించుకోని బీఆర్ఎస్

కాంగ్రెస్ టార్గెట్ గా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) పావులు కదుపుతోంది.ఇటీవల కాలంలో అనూహ్యంగా కాంగ్రెస్ బలం పుంజుకోవడం,  బీఆర్ఎస్ , బిజెపిలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు,  గతంలో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగినట్లుగా సర్వే నివేదికలతో బిఆర్ఎస్ అలర్ట్ అవుతోంది.

 Congress Is A Threat Brs Ignores Bjp , Telangana Government , Kcr, Ktr,-TeluguStop.com

ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అనేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన వివిధ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టే విధంగా బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.కాంగ్రెస్ టార్గెట్ గా అనేక ఆస్త్రాలను బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటుంది.

మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయడమే మార్గమని భావిస్తోంది .

Telugu Aicc, Brs, Hareesh Rao, Revanth Reddy, Telangana Bjp, Telangana-Politics

ఇక కాంగ్రెస్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది .క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది.అసంతృప్త నేతలను బుజ్జగించడంతో పాటు  , పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యూహాలను తిప్పి కొట్టే విధంగా ముందుకు వెళ్తోంది.  గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు చేస్తున్నారు .ముఖ్యంగా రాహుల్ , ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా అనేక విమర్శలు చేస్తున్నారు .తెలంగాణలో రాహుల్,  ప్రియాంక గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ అగ్ర నేతలే టార్గెట్ గా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.  ముఖ్యంగా మంత్రులు కేటీఆర్ ( KTR ) హరీష్ రావు, ( Hareesh Rao ) జగదీశ్ రెడ్డి , నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత వంటి వారు రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు.

Telugu Aicc, Brs, Hareesh Rao, Revanth Reddy, Telangana Bjp, Telangana-Politics

 సోనియాను బలిదేవతగా పోల్చుతూ…  తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేపట్టలేదని విమర్శలు చేస్తున్నారు.  అమలు కానీ హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శలు చేస్తున్నారు.  అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో అధికారం దక్కించుకుని తెలంగాణలోనూ అదే విధంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారని,  కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రారంభంలోనే నిలిపివేశారని, కర్ణాటకలో విద్యుత్ ఆందోళనలను గురించి తెలంగాణ ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటకలో అధికార పార్టీ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తెలంగాణ ప్రజలకు వివరించాలని , అక్కడ పథకాలను ప్రారంభ దశలోనే నిలిపివేయడం వంటి ప్రజలకు వివరించాలని నిర్ణయించుకుంది .పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ ( Telangana Congress )టార్గెట్ గా బీఆర్ఎస్ చక్రం తిప్పుతోంది .ఇక బిజెపి విషయంలో అంత పట్టించుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది .ప్రధాని నరేంద్ర మోది, అమిత్ షా , జేపీ నాడ్డా వంటి వారు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తూ,  బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న,  ఆ పార్టీని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది.  ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ , బీఆర్ఎస్</em( Congress BRS ) మధ్య ఉంటుందని కెసిఆర్ అంచనాకు రావడంతోనే కాంగ్రెస్ పైనే ఎక్కువగా బీఆర్ఎస్ ఫోకస్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube